సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (15:30 IST)

పోర్నోగ్రఫీ కేసు : జైలు నుంచి విడుదలైన శిల్పాశెట్టి భర్త

పోర్నోగ్ర‌ఫీ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపార‌వేత్త రాజ్‌కుంద్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని ఆర్ధ‌ర్ రోడ్డు జైలు నుంచి ఆయనకు విముక్తి లభించింది. పోర్నోగ్ర‌ఫీ కేసులో సోమవారం ముంబై కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేసింది. 
 
ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అశ్లీల వీడియోల‌ను షూట్ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని అప్‌లోడ్ చేసిన‌ట్లు రాజ్‌కుంద్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవాళ ఉద‌యం 11.30 నిమిషాల‌కు రాజ్‌కుంద్రా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. రెండు నెల‌ల క్రితం ఆయ‌న అరెస్టు అయ్యారు. 
 
ఈ బెయిలు కోసం ఆయన  రూ.50 వేల పూచీక‌త్తును సమర్పించారు. కుంద్రాతో పాటు అరెస్టు అయిన ర్యాన్ థోర్ప్‌కు కూడా బెయిల్ ఇచ్చారు. సెంట్ర‌ల్ ముంబైలో ఉన్న ఆర్డ‌ర్ రోడ్డు జైలులో రాజ్‌కుంద్రాను జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉంచారు