గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:49 IST)

నేను తప్పు చేశా.. కానీ అది సరైనదే : శిల్పా శెట్టి

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తప్పు చేశానని అంటోంది. అయితే, ఆ తప్పు సరైనదేనని సమర్థించుకుంటుంది. ఇటీవల అడల్ట్ కంటెంట్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణలో భాగంగా, శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారించారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తన ఇన్‏స్టాలో స్టేటస్ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జీవితంలో తప్పులు చేయడం అనే ఐజీ కథనాన్ని శిల్పా శెట్టి షేర్ చేసింది.
 
అందులో పూర్తి జీవితంలో తప్పులు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని తప్పులు చేయకుండా మన జీవితాలను ఆసక్తికరంగా మార్చుకోలేం.  కాకపోతే అవి ప్రమాదకరమైన తప్పులు, ఇతర వ్యక్తులను బాధించే తప్పులు కాకుడదని మాత్రమే కోరుకోవాలని తెలిపింది. 
 
జీవితంలో తప్పులు ఉంటాయి. అయితే వాటిని మార్చిపోవాలనుకునే విషయాలుగా ఒక సవాలుగా భావించే అనుభవాలుగా చూడాలని తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. 
 
నిజమే నేను తప్పులు చేయబోతున్నాను, అందుకు నన్ను నేను క్షమించుకుంటూ వారి నుంచి నేర్చుకుంటాను అంటూ శిల్పా శెట్టి నేను తప్పు చేశా కానీ అది సరైనదే అంటూ ఆ కథకు యానిమేటెడ్ స్టిక్కర్ జతచేసింది.