ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:15 IST)

శిల్పాశెట్టిపై చీటింగ్ : సునందా శెట్టిపై ఎఫ్ఐఆర్

అడల్ట్ కంటెంట్ మేకింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసివున్నారు. ఇపుడు శిల్పాశెట్టి తల్లి సునందా కుంద్రాపై కూడా చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పలు కోణాల‌లో విచారిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా భార్య‌తో పాటు బంధువుల‌ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక ప‌లువురు వీరిపై కేసులు పెట్ట‌డంతో కేసులు కూడా న‌మోదు చేస్తున్నారు. తాజాగా శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్‌గంజ్‌, విభూతిఖండ్ పోలీస్ స్టేష‌న్‌ల‌లో వారిపై కేసు పెట్టారు.
 
ఈ క్ర‌మంలో పోలీసుల రెండు బృందాలుగా విడిపోయి విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్‌ సుమన్‌ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబై చేరుకుంది. 
 
వివ‌రాల‌లోకి వెళితే శిల్పాశెట్టి అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో ఫిటినెస్‌ సెంటర్‌ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.