శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (13:03 IST)

మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. శ్రీరెడ్డి కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్ పేరిట తెలుగు సినీ పరిశ్రమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేప

క్యాస్టింగ్ కౌచ్ పేరిట తెలుగు సినీ పరిశ్రమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. మెగా ఫ్యామిలీలో ఒకతను తనకు బాగా క్లోజని.. తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. 
 
మెగా ఫ్యామిలీలో ఒకతను తనకు బాగా క్లోజ్.. అతను చెప్పాడు.. ప్రజారాజ్యం అప్పుడు అవతవకలు బాబోయ్.. ఆ సంగతి తెలిస్తే.. ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.. టైమ్ వచ్చినప్పుడు రివీల్ చేస్తానని శ్రీరెడ్డి తెలిపింది. మరోవైపు.. ఆఫీసర్ గ్రేట్ మూవీ అంటూ శ్రీరెడ్డి కితాబిచ్చింది.
 
ఆఫీసర్‌గా నాగార్జున ఇరగదీసేశారు. ఇక ఆర్జీవీ అంటారా అబ్బో.. ఆయన గ్రేట్ డైరెక్టరూ.. అనవసరంగా కొంతమంది పెంట ఫ్యాన్స్ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. పిచ్చి రాజకీయాలు చేయకండి. మీకు ఏమైనా సందేహం ఉంటే సినిమా చూసి చెప్పండని ఓ రేంజ్ ఆఫీసర్ చిత్రాన్ని పొగిడేసింది. ఇక పనిలో పనిగా మీ ఫ్యామిలీ నుండి మూవీస్ వచ్చినప్పుడు చూస్కుందామంటూ మంగమ్మ శపథం కూడా చేసేసింది.