అందుకు నేను ఒప్పుకోవడంలేదని మా నాన్న నన్ను చంపేస్తానంటున్నాడు: నటి ఆందోళన

Tripti Shankhdhar
ఐవీఆర్| Last Modified బుధవారం, 26 ఆగస్టు 2020 (18:45 IST)
వెండితెర, బుల్లితెర నటి తృప్తి శంకధార్ తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది. హిందీలో ఫేమస్ సీరియల్ ‘కుంకుమ భాగ్య’లో నటిస్తున్న తృప్తి శంకధార్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా చెపుతూ... తన తండ్రితో తనకు ప్రాణహాని వున్నదంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

గత కొన్ని రోజులుగా తన తండ్రి తనపై ఓ విషయంపై ఒత్తిడి తెస్తున్నారనీ, ఆయనకు నచ్చిన యువకుడిని పెళ్లిచేసుకోవాలని చెప్పారనీ, తను చేసుకోను అని చెప్పిన దగ్గర్నుంచి నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడనీ, తనకు చాలా భయంగా వుందని వెల్లడించింది.

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీకి చెందిన తృప్తి, రాయ్‌బరేలీ పోలీసులు తనకు రక్షణ కల్పించాలంటూ వీడియో ద్వారా కోరింది. ఇప్పటికే తనపై ఆయన భౌతిక దాడి కూడా చేశారనీ, ఇప్పుడు చంపుతానంటూ బెదిరిస్తున్నారని వెల్లడించింది.


#uppolice #yogi #spcity #bareilly #delhi

A post shared by Tripti Shankhdhar (@triptishankhdhar) on
దీనిపై మరింత చదవండి :