సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (19:11 IST)

పార్ట్‌నర్ గా ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని చిత్రం

Adi Pinishetti, Hansika
Adi Pinishetti, Hansika
ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలలో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ & కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'పార్ట్‌నర్'. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి నిర్మాతగా బి.జి.గోవింద్ రాజు సమర్పణలో తెలుగు, తమిళ్ ఏకకాలంలో ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.
 
'హిలేరియస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'పార్ట్‌నర్' అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. మేము నవ్వించడానికి రెడీ.. మీరు నవ్వడానికి రెడీనా ?'' అన్నారు ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకర్స్.  
 
ఈ చిత్రంలో యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. పల్లక్ లాల్వానీ,  పాండిరాజన్, రోబో శంకర్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంతోష్ ధయానిధి సంగీతం అందిస్తుండగా, షబీర్ అహమ్మద్ సినిమాటోగ్రఫర్. ప్రదీప్   రాఘవ్ ఎడిటర్.
 
తారాగణం: . ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని, యోగి బాబు,  పల్లక్ లాల్వానీ,  పాండిరాజన్,  రోబో శంకర్ , జాన్ విజయ్,  రవి మరియ, టైగర్ తంగదురై