శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (11:56 IST)

సహజీవన భాగస్వామిని హత్య చేశాడు- ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు

crime
ముంబైలో ఓ వ్యక్తి తన సహజీవన భాగస్వామి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. క్షణికావేశాలు, కక్ష్య సాధింపు కారణాలతో రోజు రోజుకీ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తన సహజీవన భాగస్వామిని ఓ వ్యక్తి చంపి ముక్కలు చేశాడు. అంతటితో ఆ రాక్షసుడు ఆగలేదు. ఆపై ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మీరా రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో మనోజ్ సహానీ (56), సరస్వతి వైద్య (36)తో కలిసి మూడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా, అతడి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
అక్కడికి చేరుకున్న పోలీసులకు మనోజ్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.