సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (13:11 IST)

తెలుగు వెండితెరకు తెలుగమ్మాయి టాటా

తెలుగు వెండిరకు ఓ తెలుగు అమ్మాయి టాటా చెప్పింది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్యా రాజేష్. ఈమెకు తెలుగులో కంటే..  తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిగా ఉన్నప్పటికీ ఈమెకు తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె టాలీవుడ్‌కు టాటా చెప్పేసి కోలీవుడ్‌లో స్థిరపడిపోవాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఐశ్వర్యా రాజేష్ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్‌లో నటించింది. ఈ చిత్రంపై ఐశ్వర్య బోలెడన్ని ఆశలుపెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా తుస్సుమనడంతో ఈమె వైపు టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు పెద్దగా చూడడం లేదట.
 
ఇక్కడ వెయిట్‌ చేస్తూ టైం వేస్ట్‌ చేసుకోవడం కన్నా తనకు అచ్చొచ్చిన కోలీవుడ్‌లోనే సినిమాలు చేయడం బెటరనుకుందట! ఇక మీద ఇక్కడ సినిమా చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలని భావిస్తోందట! అంటే తెలుగుకు ఐశ్వర్యా రాజేష్‌ దాదాపు టాటా చెప్పినట్టే అంటున్నారు సినీ జనాలు.