సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (10:52 IST)

కొత్త వ్యాపారం వైపు మహేష్ బాబు చూపు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్‌గా గుర్తింపు పొందిన ఈయన.. ఒకవైపు అగ్ర హీరోగా రాణిస్తూనే, మరోవైపు తనకు అచ్చొచ్చిన వ్యాపారాల్లో అడుగుపెట్టి విజయవంతంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్, హంబుల్ డ్రసెస్‌తో పాటు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై పలు చిత్రాలు కూడా నిర్మించారు. ఇలా పలు రంగాల్లో ముందుకు దూసుకెళుతున్న మహష్ బాబు... తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాడు. 
 
ఈ కొత్త వ్యాపారం ఏంటోకాదు. ప‌ర్‌ఫ్యూమ్ బిజినెస్. ఈ విష‌యంపై మ‌హేష్ కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని ఇండ‌స్ట్రీ వర్గాల‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లో ఎంత నిజ‌ముందనే విష‌యంపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. ఇటీవ‌ల "స‌రిలేరు నీకెవ్వ‌రు" చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో వంశీ పైడిప‌ల్లి లేదంటే ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. మ‌రోవైపు చిరు 152వ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.