గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (22:48 IST)

మైండ్ బ్లాక్ వీడియో సాంగ్.. సెన్సేషన్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు లేటెస్ట్ సెన్సేషన్ సరిలేరు నీకెవ్వరు. సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో మహేష్ బాబు యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది. అలాగే లేడీ అమితాబ్ విజయశాంతి పాత్ర కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 
 
మహేష్‌ బాబు కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇందులోని పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పచ్చు. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి, దేవిశ్రీ సాహిత్యం అందించారు. బ్లేజీ, రనినా రెడ్డి ఈ పాటను పాడారు. ఈ పాట లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు థియేటర్లో ఈ పాటను చూస్తామా అని అభిమానులు ఎదురు చూసారు. అంతలా ఈ పాట ఆకట్టుకుంది.
 
ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ పాటకు మరింత ఆదరణ లభించింది. విన్నప్పుడు కంటే.. ఈ పాటను తెరపై చూస్తుంటే అద్భుతం అనేలా ఉందని చెప్పచ్చు. ఈ సాంగ్ ఇంతలా సక్సస్ కావడానికి కారణం ఏంటంటే... మహేష్ బాబు ఈ మూవీలో డ్యాన్స్ బాగా వేయడం. ఈ పాట మధ్యలో మహేష్‌ బాబు ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైలాగులు చెప్పడంతో క్లాసు, మాసు అనే తేడా లేకుండా అందర్నీ ఆ డైలాగులు ఆకట్టుకున్నాయి. 
 
రీసెంట్‌గా ఈ సాంగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ పాటను ఇలా రిలీజ్ చేసారో లేదో అలా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకెళుతుంది. ఇప్పటివరకు ఈ వీడియో సాంగ్ 10 మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి రిలీజై సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు 50 రోజులు పూర్తి చేసుకుంది.
 
అయినప్పటికీ... కొన్ని ఏరియాల్లో సరిలేరు నీకెవ్వరు సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మహేష్‌ని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. అందుకనే మహేష్‌ని పోకిరి లాంటి మాంచి మాస్ మూవీ చేయమంటున్నారు అభిమానులు. ఈ సినిమాలో అభిమానులు కోరుకుంటున్నట్టుగా మహేష్ పాత్ర ఉండడంతో ఫ్యాన్స్ వెంటనే కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో మాస్ మూవీ చేస్తే.. ఇంతలా ఆదరిస్తారా అని తెలుసుకున్నాను అని మహేష్‌ బాబు చెప్పారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకులకు ఎంతలా నచ్చిందో..?
 
మహేష్‌ బాబు ఈ సక్సెస్ దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి చేసే సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. కథ ఫైనల్ చేసే ముందు అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటున్నారో? ఆ విధంగా ఈ సినిమాలో పాత్ర ఉంటుందో..? లేదో..? చెక్ చేసుకుంటానని ఇటీవల తెలియచేసారు. మహేష్, పరశురామ్‌తో తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. మహేష్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు.