శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 29 ఫిబ్రవరి 2020 (19:52 IST)

మహేష్‌ - పరశురామ్ మూవీ ఉందా..? లేదా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ సినిమా అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ.. ఇప్పటివరకు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. అసలు ఏం జరిగిందంటే... మహేష్ బాబుకి గతంలో పరశురామ్ ఓ కథ చెప్పడం... ఆ కథ నచ్చినప్పటికీ మహేష్‌ ప్రస్తుతం ఈ కథతో సినిమా చేయలేను భవిష్యత్‌లో చేద్దాం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరశురామ్ చైతన్య కోసం కథ రెడీ చేయడం.. కథ విని చైతు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాని త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసారు. 
 
14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. లవ్ స్టోరీ షూటింగ్ తర్వాత నాగచైతన్య పరశురామ్‌తో చేయనున్న షూటింగ్‌లో జాయిన్ అవుతారు అనుకుంటే... పరశురామ్‌కి అనుకోకుండా మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో నాగ చైతన్యతో పరశురామ్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగింది. 
 
అయితే.. మహేష్‌ బాబు - పరశురామ్ సినిమా కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నప్పటికీ.. మరోవైపు మహేష్ బాబు వేరే దర్శకుల కథలు వింటున్నారు అని టాక్ రావడంతో అసలు పరశురామ్ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందా లేదా అనే డౌట్ వచ్చింది. గరుడవేగ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మహేష్ బాబుకి కథ చెప్పారు. ఈ కథ 80 పర్సంట్ నచ్చింది. మహేష్ ఈ కథలో  కొన్ని మార్పులు చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత ప్రవీణ్ సత్తారు ఫుల్ నెరేషన్ ఇస్తారు. 
 
అప్పుడు మహేష్‌ బాబుని మెప్పిస్తే.. ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్టే అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా మహేష్‌ కోసం ఓ స్టోరీ లైన్ రెడీ చేసారని తెలిసింది. త్వరలో మహేష్ బాబుకి ఇంద్రగంటి కథ చెబుతారని... వీరిద్దరి కాంబినేషన్లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.

మరోవైపు ఓ నూతన దర్శకుడు కూడా కథ చెప్పాడని తెలిసింది. ఇలా.. మహేష్ వేరే డైరెక్టర్స్ చెప్పే కథలు వింటున్నారని తెలిసినప్పటి నుంచి పరశురామ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందా..? లేదా..? అసలు ఏమైంది..? అనేది ఆసక్తిగా మారింది. 
 
ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి తాజా వార్త ఏంటంటే... పరశురామ్ చెప్పిన స్టోరీకి మహేష్ బాబు ఓకే చెప్పారని తెలిసింది. ఈ స్క్రిప్ట్ వర్క్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కూడా పాల్గొని.. ఆయన తన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ మూవీని జులైలో ప్రారంభించనున్నారు. 2021 సమ్మర్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

80 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించనున్నారని.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుందని తెలిసింది. ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్‌గా మది, సంగీత దర్శకుడుగా గోపీ సుందర్ ని సెలెక్ట్ చేసారని టాక్. అయితే.. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా చేస్తారా..? లేక తెలుగులో మాత్రమే నిర్మిస్తారా..? అనేది తెలియాల్సివుంది.