సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2020 (21:12 IST)

తెలుగు సినిమా పరిశ్రమకు టాటా చెబుతున్న బ్యూటీ?

కొందరి అదృష్టం అంతే. అందం ఉంటుంది. నటించే సత్తా ఉంటుంది. కానీ అదృష్టమే ఆమడదూరంలో ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అనుపమ పరమేశ్వరన్‌కు ఎదురవుతోంది. మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అనుపమ. 
 
అందచందాలకేమీ లోటు లేదు. కాకపోతే ఎక్స్‌పోజింగ్‌కు మాత్రం కాస్త దూరం. ఇది అభిమానులకు బాగా తెలుసు. అందుకే అనుపమకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఎక్స్‌పోజింగ్‌కి నో అనడంతో అనుపమకు బాగా మైనస్‌గా మారుతోందట.
 
ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా మాత్రమే ఉంది. అది కూడా చిన్న సినిమా. దాని తరువాత మరే సినిమా లేదు. టాలీవుడ్లో కన్నా కోలీవుడ్, మాలీవుడ్ మీద దృష్టిసారించాలని అనుపమ భావిస్తోందట. ఇక మీదట తెలుగు తెర మీద అనుపమ సినిమా కనిపించపోవచ్చంటూ తెలుగు సినీపరిశ్రమలో ప్రచారం బాగానే జరుగుతోందట.