సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (11:04 IST)

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

ajith kumar
హీరో అజిత్ కుమార్‌‍కు ప్రాణముప్పు తప్పింది. స్పెయిన్‌లో జరుగుతున్న కార్ రేసింగ్ పోటీల్లో ఆయన పాల్గొనగా, ఆయన నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. మరోకారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో అజిత్ కుమార్ కార్ రేసింగ్ కంపెనీ షేర్ చేసింది. 
 
ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న కార్ రేసింగ్ పోటీల్లో అజిత్ కుమార్ పాల్గొన్నారు. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. మరో కారును తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆయన కారులోనుంచి సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ కుమార్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆయన క్షేమంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ప్రమాదం తర్వాత కూడా ఆయన రేసింగ్ కొనసాగించారు. 
 
ఇక గత నెలలో దుబాయ్‌లో గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తున్న సమయంలో కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఆయన కారు సమీపంలోనే గోడను బలంగా ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదం నుంచి అజిత్ కూడా సురక్షితంగా బయటపడిన విషయం తెల్సిందే. ఈ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన టీమ్ మూడో స్థానంలో నిలిచింది.