గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (20:39 IST)

అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం... ఎవరు చనిపోయారంటే..

naga saroja
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి నాగ సరోజ చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ముంబైలో చనిపోయారు. దీంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. 
 
ఎవర్ గ్రీన్ యంగ్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు - అన్నపూర్ణ దంపతులకు నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ, అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జునలు. వీరిలో నాగ సత్యవతి చాలా రోజుల క్రితం కన్నుమూశారు. 
 
నాగ సరోజ కూడా ఆది నుంచి చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు. పైగా, అవివాహిత కూడా. దీంతో ఆమె గురించి చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన అక్కినేని శతజయంతి వేడుకల్లో భాగంగా తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.