శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (19:19 IST)

అల్లరి నరేష్ 'సెల్ఫీరాజా' సెన్సార్ పూర్తి... జూలై 15న గ్రాండ్ రిలీజ్

సెల్ఫీ మేనియాక్ 'సెల్ఫీరాజా'గా అల్ల‌రి న‌రేష్ తన కామెడీతో ప్రేక్షకులను కితకితలు పెట్టిండానికి మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది.

సెల్ఫీ మేనియాక్ 'సెల్ఫీరాజా'గా అల్ల‌రి న‌రేష్ తన కామెడీతో ప్రేక్షకులను కితకితలు పెట్టిండానికి మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' ఫేమ్ జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్‍ను చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి నిర్మించారు.
 
సాక్షిచౌదరి, కామ్నా రనౌత్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'సినిమా టైటిల్ నుండి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సెల్ఫీ మేనియాక్‌గా అల్లరి నరేష్ సందడి చేయడానికి రెఢీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్, థియేట్రికల్ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
అల్లరి నరేష్ నుండి ఎలాంటి కామెడి కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడితో నరేష్ నవ్వించడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు యూత్‌లో ఉన్న సెల్ఫీ‌ట్రెండ్‌తో నరేష్ ఎలాంటి కామెడి చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమాను జూలై 15న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.