శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (17:16 IST)

అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా.. పూరీ జగన్నాథ్‌ డైరక్షన్

తెలుగు తెరపై త్వరలో సూపర్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని టాక్ వస్తోంది. ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌

తెలుగు తెరపై త్వరలో సూపర్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని టాక్ వస్తోంది. ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందట. ఇప్పటికే సాయిధరమ్‌, కల్యాణ్‌ రామ్‌ కలయికలో ఓ మల్టీస్టారర్‌ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. 
 
మరోవైపు అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో త్వరలో సూపర్ హిట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్‌ హీరోల కలయిక వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీయార్‌, బన్నీకి వినిపించాడని టాక్ వస్తోంది. ఈ కథ ఇద్దరు హీరోలకు బాగా నచ్చడంతో బన్నీ, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.