గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (18:45 IST)

అలీఘర్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన బన్నీ వీరాభిమాని (వీడియో)

Allu Arjun
Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీరాభిమాని ఒకరు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ నుండి హైదరాబాద్‌కు 1,600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. సైకిల్ తొక్కుతూ.. ఆ అభిమాని అలీఘర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. 
 
ఇక అభిమానుల పట్ల ఎప్పుడూ ఉదారంగా వుండే అల్లు అర్జున్, తన వీరాభిమానిని తన నివాసంలో స్వాగతం పలికారు. అల్లు అర్జున్‌ను అమితంగా ఇష్టపడే ఓ అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నుండి ఐకాన్‌స్టార్‌ను కలవడానికి సైకిల్‌పై 1,600 కిలోమీటర్లు ప్రయాణించి అల్లు అర్జున్‌ను చేరుకున్నాడు. 
Allu Arjun
Allu Arjun


తన అభిమాన హీరోని కలిసిన అతను కాసేపు ఆయనతో చిట్‌ చాట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆ అభిమాని భావోద్వేగానికి గురైన క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకా అల్లు అర్జున్‌ తన వీరాభిమానిని "రియల్ హీరో"గా అభివర్ణించారు. అలాగే అల్లు అర్జున్‌ను కలవడం మరపురాని అనుభూతి అంటూ హర్షం వ్యక్తం చేశాడు.