బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (13:08 IST)

అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. డ్యాన్స్ స్కూల్‌లో ఒంటరిగా వుండగా..?

దక్షిణాది నటి కిడ్నాప్ ఘటన మరవకముందే.. మరో దక్షిణాది నటి అమలాపాల్ లైంగిక వేధింపులకు గురైంది. డ్యాన్స్ స్కూల్ యజమాని అళగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అమలాపాల్ ఆరోపించింది. ఇంకా చెన్నై మాంబలం పోలీ

దక్షిణాది నటి కిడ్నాప్ ఘటన మరవకముందే.. మరో దక్షిణాది నటి అమలాపాల్ లైంగిక వేధింపులకు గురైంది. డ్యాన్స్ స్కూల్ యజమాని అళగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అమలాపాల్ ఆరోపించింది. ఇంకా చెన్నై మాంబలం పోలీస్ స్టేషన్లో అమలాపాల్ బుధవారం ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అళగేశన్ అరెస్ట్ చేశారు.  
 
ఈ కేసులో అళగేసన్‌పై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అమలాపాల్ మాట్లాడుతూ.. మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి డాన్సింగ్ తమిళచ్చి కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను చెన్నై టీనగర్‌లోని డ్యాన్స్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపింది. డ్యాన్స్ స్కూలులో అళగేశన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అమలా పాల్ ఆరోపించారు.
 
డ్యాన్స్ క్లాస్‌లో ఒంటరిగా వుండగా వున్నప్పుడు అళగేశన్ అభ్యంతరకరంగా మాట్లాడేవాడని చెప్పారు. ఒంటరిగా వృత్తిపరంగా రాణించేందుకు తన పని తాను చేసుకుంటే.. ఇలాంటి ఘటనలతో అభద్రతా భావం ఏర్పడిందని.. మహిళాభివృద్ధి కోసం చేసే కార్యక్రమంలోనే ఇలాంటి వేధింపులు ఎదురైనాయని.. అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది.