వెబ్ సిరీస్‌పై కన్నేసిన అమలా పాల్.. ఆ కంటెంట్ అధికమైనా పర్లేదట..!
దక్షిణాది హీరోయిన్‌గా మంచి పేరున్న అమలా పాల్.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు సై అంటోంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ తెలుగులో నాయక్, బెజవాడ, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో నటించింది. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరమై.. ఆపై విడాకులు తీసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. తాజాగా బాలీవుడ్‌లో హిట్టైన తెలుగు వెబ్ సిరీస్ రీమేక్‌లో నటించనుంది.
మహేష్ భట్, జియో స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ తెలుగులో రీమేక్ కానుంది. ఇందులో అమలా పాల్ నటిస్తుందని సమాచారం. కైరా అద్వానీ సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్‌లలో కూడా బిజీగా ఉంది. కాజల్ అగర్వాల్, సమంత కూడా ఈ మధ్య వెబ్ సిరీస్‌లకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
ఇక అమలా పాల్ కూడా వెబ్ సీరిస్ ఛాన్స్ అందుకుంది. లస్ట్ స్టోరీస్ రీమేక్‌లో అమలాపాల్ నటించనుందట. ఇందులో అడల్డ్ కంటెంట్ అధికంగా వుంటుందని టాక్ వస్తోంది. లస్ట్ స్టోరీస్‌లో కైరా అధ్వానీ పాత్రలో అమలాపాల్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ రోల్‌లో అమలాపాల్ బోల్డుగా నటించేందుకు సిద్ధమని తెలుస్తోంది. హాట్ హాట్‌గా కనిపించేందుకు తాను వెనకాడనని అమలాపాల్ ఇప్పటికే తేల్చేసిందట.