ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (18:27 IST)

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఏమి చేసింది!

Suhas, Shivani Nagar and others
Suhas, Shivani Nagar and others
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా లీడ్ యాక్టర్స్ అందరూ ఉన్న పోస్టర్ రివీల్ చేశారు.
 
కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్  కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉందీ సినిమా. త్వరలోనే థియేటర్స్ ద్వారా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.