శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 29 మే 2021 (19:43 IST)

ముంబైలో 31 కోట్ల‌తో డ్యూప్లెక్స్ కొన్న అమితాబ్‌

Amitab Duplex
క‌రోనా స‌మ‌యంలో అన్ని రంగాల్లో ఎదుగుల త‌గ్గిపోవ‌డంతో రియ‌ల్ ఎస్టేట్‌కూడా త‌గ్గింది. కొత్త‌గా వున్న స్థ‌లాలు, ఇళ్ళ‌పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రియల్ ఎస్టేట్ పై స్టాంప్ సుంకాన్ని 5 నుండి 2 శాతానికి తగ్గించింది. దీన్ని ప్ర‌ముఖులు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా అమితాబ్ దాన్ని ఉప‌యోగించుకున్న‌ట్లు తెలుస్తోంది. ముంబైలోని అంధేరిలో నిర్మాణంలో ఉన్న అట్లాంటిస్లో 31 కోట్ల రూపాయలకు డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ అమితాబ్ పేండ‌మిక్ టైంలో కొనుగోలు చేసిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ముంబైలో అనేక అందమైన బంగ్లాలను కలిగి ఉన్నా ఇది స‌రి కొత్తగా వుంద‌ని అన్ని వ‌స‌తులు వున్నాయ‌ని తెలుస్తోంది.
 
అమితాబ్ బచ్చన్ 2020 డిసెంబర్‌లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు, అయితే ఇది 2021 ఏప్రిల్‌లో నమోదు చేయబడింది, దీని కోసం అతను 62 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించాడు. దీని లగ్జరీ అపార్ట్మెంట్ పరిమాణం 5184 చదరపు అడుగులు. ఇక  బి-టౌన్ సెలబ్రిటీలు చాలా మంది గత ఒక సంవత్సరంలో ముంబైలో విలాసవంతమైన అపార్టుమెంట్లు కొన్నారు. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా ఇద్దరూ వరుసగా బాంద్రా, సన్నీ లియోన్, ఆనంద్ ఎల్. రాయ్లలో 20 కోట్ల రూపాయల విలువైన అపార్టుమెంటులను కొనుగోలు చేశారు. అయితే బిగ్ బి స్వయంగా అంథేరిలోని ఈ అపార్ట్ ని కొనుగోలు చేయడం వెనక కారణమేమిటి అంటే బహుశా తన మనవరాలు ఆరాధ్య బచ్చన్ కి కానుకిస్తున్నారా అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.