శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (14:13 IST)

అమితాబ్ బచ్చన్‌తో నటించే ఛాన్స్ ఇప్పుడే వస్తుందనుకోలేదు.. రష్మిక

కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఆ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో వరసగా పాన్ ఇండియన్ సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంటోంది. 
 
ఒక్క తెలుగులో మాత్రమే కాదు, హిందీ.. తమిళ సినిమాలలో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో స్టార్ హీరో కార్తీ సరసన సుల్తాన్ సినిమా చేసి తమిళ ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగులో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పతో పాటు ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తోంది. 
 
ఇక బాలీవుడ్‌లో మిషన్ మజ్ను- గుడ్ బాయ్ సినిమాలు చేస్తున్న రష్మిక ఇంకా కొత్త తరహా పాత్రలు చేయాలని ..కొత్త తరహా కథలు ఎంచుకోవాలని ఉందంటూ చెప్పుకొస్తోంది. కాగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదంటోంది రష్మిక. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరసగా సక్సస్‌లు అందుకుంటున్న రష్మిక బాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.