మంగళవారం, 3 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కమల్ హాసన్‌ కోసం కుటుంబ సభ్యులు.. వీధుల్లో డ్యాన్సులు

ఈ నెల ఆరో తేదీన తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సినీ నటుడు కమల్ హాసన్ కూడా పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరు పశ్చిమ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలో దిగుతోంది. ఇక కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కమల్ కోసం ఆయన కుమార్తె అక్షర హాసన్, సోదరుడి కుమార్తె సుహాసిని ప్రచారం చేస్తున్నారు.
 
ఎంఎన్ఎం పార్టీ ఎన్నికల గుర్తు టార్చిలైటు కాగా, టార్చి చేతబట్టిన సుహాసిని, అక్షర ఎంతో హుషారుగా డ్యాన్సులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో వీరి ప్రచారం ఆద్యంతం రక్తికట్టించేలా సాగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.