సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (16:54 IST)

మాతృభాషలో చెప్తున్నా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు అనేక మంది సినీ ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షల సందేశాలు వస్తున్నాయి. అయితే ఈరోజు అనుకోని అతిథి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈరోజు అమితాబ్ ఓ వీడియో ద్వారా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అమితాబ్‌కి ధన్యవాదాలు తెలియజేసింది. 
 
ఈ వీడియోలో అమితాబ్ మాట్లాడుతూ "చరణ్, దిస్ ఈజ్ అమితాబ్. మార్చి 27న నీ పుట్టినరోజు. నా నుండి అలాగే నా ముంబై కుటుంబం నుండి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. మున్ముందు నీకు మరిన్ని విజయాలు చేకూరాలని ప్రార్థిస్తున్నా. నీ వయసు ఎంతో నాకు తెలీదు, నిన్ను ఎప్పుడు చూసినా 18 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తావు. నీ మాతృభాషలో చెబుతున్నా... నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ చివరలో తెలుగులో శుభాకాంక్షలు తెలియజేసారు.