శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (10:52 IST)

పాప ఏడుస్తోంది.. అయినా అమ్మడు అంటే లెట్స్ డు కుమ్ముడు అంటోంది.. (వీడియో)

మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటకు యమా క్రేజ్ లభించింది. యూత్‌తో పాటు చిన్న పిల్లల్ని కూడా ఈ పాట బాగా ఆకట్టుకుంది. చివరికి చిన్న పిల్లలు కూడా అమ్మడు అంటే లెట్స

మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటకు యమా క్రేజ్ లభించింది. యూత్‌తో పాటు చిన్న పిల్లల్ని కూడా ఈ పాట బాగా ఆకట్టుకుంది. చివరికి చిన్న పిల్లలు కూడా అమ్మడు అంటే లెట్స్ డూ కుమ్ముడు అంటున్నారు.

ఈ క్రమంలో నిండా ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నారి అమ్మ కోసం ఏడుస్తూనే.. అమ్మడు అంటే ‘లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ అందరినీ నవ్వించింది. ఓ వైపు ఏడుపు.. మరో వైపు పాట.. ఇలా చిన్నారి రెండూ మేనేజ్ చేస్తుంటే చూసేవాళ్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. 
 
‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే పాటకు రాక్‌స్టార్ దేవీ శ్రీప్రసాద్ మాస్ మ్యూజిక్ అందించారు. దీనికి తోడు చిరు, కాజల్ జంట మాస్ స్టెప్పులు కూడా పాటకు బాగా కలిసొచ్చాయి. ఈ పాటకు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ పాటను ఏడుస్తున్నా.. పాడుతూ.. తెగ నవ్విస్తోంది. ఈ వీడియోను మీరు కూడా చూడండి.