సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (20:05 IST)

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం- భూలోక స్వర్గాన్ని తలపించేలా ఏర్పాట్లు (Photos)

Anant Ambani
Anant Ambani wedding
దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం కావడంతో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే ఈసారి ఆయన వార్తల్లో నిలవడానికి కారణం ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్ ఫంక్షన్లు. ఇవాళ శుభ్‌ వివాహ్‌… శని శుభ్‌ ఆశీర్వాద్‌, ఎల్లుండి మంగళ్‌ ఉత్సవ్‌తో వెడ్డింగ్‌ వేడుకలు ముగియనున్నాయి. 
Anant Ambani
Anant Ambani wedding
 
అనంత్‌ అంబానీ- రాధికా మర్చెంట్‌ వివాహానికి సమయం ఆసన్నమైంది. ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్‌‌లో ఈ జంట.. వివాహా బంధంతో ఒక్కటి కాబోతున్నారు. 
Anant Ambani
Ananya



ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. భూలోక స్వర్గాన్ని తలపించేలా చేసిన ఏర్పాట్లు అద్దిరిపోయాయి. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలివస్తుండటంతో ముంబైలోని జియో వాల్డ్‌ సెంటర్ కళకళలాడుతోంది. 
Anant Ambani
Rajinikanth
 
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి సంబరాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

venkatesh
venkatesh


అంబానీ నివాసం అంటిలియా నుంచి కళ్యాణ వేదికకు అనంత్‌ అంబానీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. మరికొద్దిసేపటిలో అనంత్‌ అంబానీ రాధికా మర్చంట్‌ మెడలో తాళి కట్టనున్నారు. 
Anant Ambani
Dhoni
 
ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడా ప్రముఖులు అతిథులుగా తరలివస్తున్నారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా సినీ ప్రముఖులు సైతం ఈ వేడుకల్లో సందడి చేస్తున్నారు. 

Anant Ambani