సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (10:48 IST)

నేను ప్రపోజ్ చేసినపుడు.. అతను స్పందించలేదు : సుధీర్‌తో లవ్‌పై రేష్మీ

బుల్లితెర హాట్ యాంకర్, 'జబర్దస్త్' వ్యాఖ్యాత రేష్మి తన మనసులోని మాటను వెల్లడించింది. తాను ప్రపోజ్ చేసినపుడు సుధీర్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని అందుకే తాను మిన్నకుండిపోయినట్టు చెప్పింది.

బుల్లితెర హాట్ యాంకర్, 'జబర్దస్త్' వ్యాఖ్యాత రేష్మి తన మనసులోని మాటను వెల్లడించింది. తాను ప్రపోజ్ చేసినపుడు సుధీర్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని అందుకే తాను మిన్నకుండిపోయినట్టు చెప్పింది.
 
బుల్లితెరపై సుధీర్‌, రష్మీ జంట ప్రేమికులుగా నటిస్తూ అలరిస్తుంటారు. తాజాగా అభిమానులు సుధీర్‌ గురించి ఆమెను ప్రశ్నించారు. 'సుధీర్‌ మీకు ప్రపోజ్‌ చేశారు కదా? ఎందుకు అప్పుడు సమాధానం చెప్పలేదు?' అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి రష్మీ స్పందిస్తూ, తాను ప్రపోజ్ చేసినపుడు సుధీర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పుకొచ్చింది. 
 
మరో నెటిజన్ మాట్లాడుతూ, 'ప్రోగ్రాంలో ప్రపోజ్‌ చేశాడు కదా.. అలా అడిగినందుకు క్షమించండి?' అని మళ్లీ ఓ కామెంట్‌ చేయగా, 'మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది.. 'ప్రోగ్రామ్‌లో' అంటే తెరపైన అని' అని చాలా తెలివిగా బదులిచ్చింది. 
 
ఇకపోతే, 'సినిమాల్లో మీరు కనిపించడం లేదు ఎందుకని?' అని ఒకరు ప్రశ్నించగా.. 'చేయట్లేదు కాబట్టి' అని రష్మీ చెప్పింది. 'సినిమాల్లో మీరు నటించడం లేదా? లేక తీసుకోవడం లేదా?' అని ఓ నెటిజన్‌ అడగగా ఆమె 'తీసుకోవడం లేదు' అంటూ సూటిగా చెప్పేసింది. ముక్కు సూటిగా ఆమె చెప్పిన సమాధానాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.