ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (12:10 IST)

వంగవీటి సినిమాను నేను తీస్తా.. రామ్ గోపాల్ వర్మకు జీవీ సుధాకర్ సవాల్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వాస్తవాలను వక్రీకరించారని, వంగవీటి ఫ్యామిలీని అవమానించేందుకే వర్మ ఇలా చేశాడని వంగవీటి రాధ, ఫ్యాన్స

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వాస్తవాలను వక్రీకరించారని, వంగవీటి ఫ్యామిలీని అవమానించేందుకే వర్మ ఇలా చేశాడని వంగవీటి రాధ, ఫ్యాన్స్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వర్మ స్పందిస్తూ.. తన సినిమా తప్పైతే నిజమైన వంగవీటి సినిమాను మీరు తీసుకోండంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 
 
రామ్ గోపాల్ వర్మ సవాలును వంగవీటి కుటంబ సభ్యులు స్వీకరించకపోయినా.. నటుడు, దర్శకుడు జీవీ సుధారకర్‌ నాయుడు మాత్రం స్వీకరించాడు. శ్రీకాంత్‌ హీరోగా 'రంగ ది దొంగ', నితిన్‌తో 'హీరో' వంటి సినిమాలను ఇతను తెరకెక్కించాడు. 
 
ఈ నేపథ్యంలో వంగవీటి వాస్తవ కథతో సినిమా తెరకెక్కిస్తానని, వచ్చే ఏడాది ఇదే సమాయానికి నిజమైన వంగవీటి చరిత్రను అందిస్తానని, ఆ చిత్రం ఆయన గొప్పదనాన్ని తెలియజేసేలా ఉంటుందని తెలిపాడు. జీవీ పలు సినిమాల్లో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.