శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శనివారం, 1 మార్చి 2025 (12:23 IST)

Dulquer salman: లక్కీ భాస్కర్‌ కోసం ముగ్గురు అగ్ర నిర్మాతలు అండ దండ

Dulquer, Ashwini Dutt, Allu Aravind,  Gunnam Gangaraju
Dulquer, Ashwini Dutt, Allu Aravind, Gunnam Gangaraju
పరభాషా కథానాయకులకు పెద్ద పీటవేయడం తెలుగు చలన చిత్రరంగంలో పరిపాటే. అక్కడ చిన్న హీరోల సినిమాలను కూడా ఇక్కడకు  తీసుకువచ్చి ప్రమోషన్స్‌ చేయించడం గొప్పగా భావిస్తారు. కానీ మన కథానాయకులు అక్కడ సినిమాలలో నటిస్తున్న దాఖలాలుకానీ మనవారిని ప్రమోషన్‌ చేయడం కానీ పెద్దగా లేదు. 
 
లక్కీ భాస్కర్‌ సినిమా కోసం ముందుగా మన తెలుగువాడు హీరో నాని ని సంప్రదిస్తే కొన్ని  కారణాలవల్ల చేయనన్నాడు. మరో హీరోకు కథ చెబితే, నో.. చెప్పాడు. అప్పుడు పరబాషా నటుడు మహానటి ఫేమ్‌ దుల్కర్‌ సల్మాన్‌ గుర్తుకు వచ్చాడు. వెంటనే దర్శక నిర్మాతలు సంప్రదించడం ఆయన చేయడం సక్సెస్‌ కావడం చకచకా జరిగిపోయాయి.
 
ఇప్పుడు దుల్కర్‌ సల్మాన్‌ ను మరింతగా పాపురల్‌ చేయడానికి ముగ్గురు అగ్ర తెలుగు  నిర్మాతలు నడుంకట్టారు. వైజయంతీమూవీస్‌ అధినేత అశ్వనీదత్‌, గీతా ఆర్ట్స్‌ అల్లు అరవింద్‌, జస్ట్‌ ఎల్లో బేనర్‌ గుణ్ణం గంగరాజు కలిసి సినిమా చేయడం విశేషం. ఈ సినిమా గురించి అనుకుంట, లక్కీ భాస్కర్‌ ప్రమోషన్‌ లోనే దుల్కర్‌ త్వరలో భారీ సినిమా గురించి చెబుతానని వెల్లడించారు. 
 
ఈ భారీ సినిమా పేరు ఆకాశంలో ఒక తార టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. నేడు అనగా మార్చి 1వ తేదీన షూటింగ్‌ ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి దగ్గర కోరుకొండ సమీపంలోని కనుకూరు గ్రామంలో షూటింగ్‌ జరుగుతోంది. నేడు దుల్కర్‌ సల్మాన్‌ షూటింగ్‌ లో ఎంట్రీ ఇచ్చారు. ఈయన రాకతో నిర్మాతలు అశ్వనీదత్‌, గుణ్ణంగం గరాజుకూడా హాజరయినట్లు తెలిసింది.  పవన్‌ సాధినేని తన తరహాలో క్లీన్ లవ్, యాక్షోన్ కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.