శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 మే 2017 (16:49 IST)

'బీకాంలోని ఫిజిక్స్‌లాగా.. నీ నడుమెక్కడే నాజూకు తీగ' : దుమ్మురేపుతున్న "అంధగాడు" పాట (Audio)

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం అంధగాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ జోడీ ముచ్చటగా మూడోసారి జత కట్టింది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం అంధగాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ జోడీ ముచ్చటగా మూడోసారి జత కట్టింది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పాటను మంగళవారం సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘అంధగాడు ఆటకొచ్చాడే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌కు శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చగా, ఫీమేల్ పాప్‌స్టార్ గీతామాధురి, సింహా కలిసి పాడారు.  
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సాంగ్‌లో బీకాంలో ఫిజిక్స్‌ అనే పాపులర్ సబ్జెక్ట్‌ను యాడ్ చేశారు. రాజ్‌ తరుణ్- హెబ్బాపటేల్ మధ్య డ్యూయెట్‌లో ‘బీకాంలోని ఫిజిక్స్‌లాగా.. నీ నడుమెక్కడే నాజూకు తీగ’ అనే లిరిక్‌ను వాడారు. ఈ పాటను తెలుగు లిరిక్స్‌తో విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.