శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (18:38 IST)

ఆంధ్ర ప్రదేశ్ సినిమా పరిశ్రమకు దూరం అయినట్టే : సి. కళ్యాణ్ సంచలన వ్యాఖ

c. Kalyan
c. Kalyan
ఒకప్పుడు మదరాసు నుంచి హైదరాబాద్ సినిమా పరిశ్రమ తరలి రావాలంటే హైదరాబాద్ లోనే షూటింగ్స్ జరగాలని రామారావు, నాగేశ్వరావు  పట్టు పడితేనే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అనే రెండుగా తెలుగు రాష్ట్రము విడిపోయింది. దాని వాళ్ళ నష్టపోయింది మాత్రం ఆంధ్ర ప్రదేశ్, అక్కడి ఉన్న వాళ్ళే.. అని సి. కళ్యాణ్ మనసులో మాటను చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ని సినీ పెద్దలు కలిశారు. అందులో నేనూ ఉన్నా. కానీ కొంతమందికి ఉపయోగపడే విధంగానే నిర్ణయాలు ఉన్నాయి. టికెట్ రేట్ తగ్గించారు. ఏమి చేయాలో నిర్మాతకు పాలుపోవడం లేదు. 
 
కొంతమంది రియల్ ఎస్టేట్ పనిమీద, స్వంత వ్యాపారాల గురించి జగన్ ను కలిశారు అనడం అబద్ధం అని తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా పరిశ్రమ గురించి ఇలా చెప్పారు... 
ఆంధ్ర ప్రదేశ్ సినిమా పరిశ్రమకి రెండో ఊరు అయిపొయింది. ఏదైనా సమస్య వస్తే అక్కడికి  నలుగురు కలిసి వెళ్ళడమే పెద్ద పనైపోతుంది. ఆ రకంగా ఒక దూరం వచ్చేసింది. పదేళ్ళ తర్వాత  ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా వుండరని భావిస్తాను. వున్నా అది పది శాతమే. గతంలో కృష్ణా నుండే పది మంది పరిశ్రమలోకి వచ్చి అందులో ఎవరు ఒకరు సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్ గారికి ఏపీలో చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలని వుంది. అది ఎంత వరకు సాధ్యం అవుతుందే తెలియదు.