మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 14 జులై 2025 (10:26 IST)

Chiru: శివ శంకర వర ప్రసాద్ టైటిల్ తో అనిల్ రావిపూడి !

Chiranjeevi
Chiranjeevi
సరిలేరు నీకెవరూ, సంక్రాంతికి వస్తున్నాం వంటి టైటిల్స్ తెలుగు ప్రేక్షలకు చాలా రీచ్ అయ్యాయి. ఇప్పుడు చక్కటి టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు అలాంటి టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకు టైటిల్ పరిశీలన మొదలు పెట్టారు. పలు టైటిల్స్ పరిశీలించాక మన శివశంకర ప్రసాద్ అనే టైటిల్ ఎలా వుంటుందనీ, దర్శకుల టీమ్ ను అనిల్ అడిగితే చాలా బాగుందనీ, కథకు కరెక్ట్ గా సరిపోతుందని చెప్పినట్లు సమాచారం.
 
ఈ విషయాన్ని చిరంజీవి ద్రుష్టికి తీసుకెళ్ళి ఆగస్టు 22న ఆయన జన్మదినం రోజున ప్రకటించే అవకాశం వుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. తాజా షెడ్యూల్ అలెప్పీలో ఓ పాటను చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరున బయలుదేరి వెళ్లనున్నారు. సాహు గారపాటి సినిమా నిర్మిస్తున్నారు.