ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (14:38 IST)

యానిమల్ లోని ఎమోషన్స్ టాప్ లెవల్ లో ఉంటాయంటున్న సందీప్ రెడ్డి వంగా

Ranbir Kapoor,  Rashmika
Ranbir Kapoor, Rashmika
రణబీర్ కపూర్ 'యానిమల్' ప్రతి గ్లింప్స్  ప్రేక్షకులకు హ్యూమన్ ఎమోషన్స్ స్పెక్ట్రమ్‌ను అందిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. రణబీర్ కపూర్ ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ తో ఇంటెన్స్ ప్రీ-టీజర్ తండ్రీ కొడుకుల మధ్య వున్న గ్రే  డైనమిక్స్ ప్రజంట్ చేయగా..  ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని వైవిధ్యాన్ని అద్భుతంగా చూపించింది.
 
యానిమల్ లోని రెండు పాటలు నేషనల్ వైడ్ గా చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి.  'అమ్మాయీ' అనే పాట  సోల్‌ఫుల్ సాంగ్ రొమాంటిక్ , ఎమోషనల్ లేయర్‌ను ప్రజంట్ చేసింది.  ఇటీవలి విడుదల చేసిన 'నే వేరే' పాట భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని, వివాహానంతర జీవితంలోని ఒడిదుడుకులను చూపించింది. ఈ పాటలో చిత్రీకరించిన భావోద్వేగాలు అత్యద్భుతంగా వున్నాయి.
 
మొత్తంగా ఈ ప్రమోషనల్ కంటెంట్‌ మానవ భావోద్వేగాలని అద్భుతంగా చిత్రీకరించాయి.  'యానిమల్' లోని ఎమోషన్స్ టాప్ లెవల్ లో ఉంటాయని హామీ ఇస్తున్నాయి. యానిమల్ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న మరిన్ని లేయర్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
'యానిమల్' ని భూషణ్ కుమార్,  క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది.
 
తారాగణం: రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ