మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 5 జనవరి 2025 (18:08 IST)

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

oyo hotel
oyorooms ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో OYO పెళ్లికాని జంటలకు షాకిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై పెళ్లికాని జంటలకు ఓయో గదులను అద్దెకి ఇవ్వబోమని ఒక ప్రకటనలో కంపెనీ ఆదివారం నాడు వెల్లడించింది. సవరించిన పాలసీ ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వరు. ఒకవేళ గదిని బుక్ చేసుకోవాలంటే జంటకు సంబంధించిన పెళ్లిని నిర్థారించే ఐడి ప్రూఫ్ చూపించాల్సి వుంటుంది.
 
ఒకవేళ ఐడి ప్రూఫ్ అనుమానాస్పదంగా వుంటే గదులను కేటాయించడాన్ని నిలుపుదల చేస్తుంది. ముఖ్యంగా మీరట్ లో ఇది తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించింది. సవరించిన నిబంధనలను అమలులో పెట్టాక వినియోగదారుల అభిప్రాయాలను అనుసరించి మరికొన్ని నగరాలకు దీన్ని విస్తరింపజేస్తారు.
 
తమ హోటల్స్‌లో చెక్-ఇన్ అయ్యేవారి విషయంలో విద్యార్థులు, కుటుంబాలు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతులను అందించే బ్రాండుగా నిలవాలన్న యోచనలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెళ్లి ధృవీకరణకు ఎలాంటి పత్రం సమర్పించాలన్నది మాత్రం స్పష్టీకరించలేదు.