మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 5 జనవరి 2025 (14:01 IST)

19 ఏళ్ల యువకుడితో 32 ఏళ్ల భార్య అర్థరాత్రి రాసలీల చూసి హత్య చేసిన భర్త

crime
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటకి సమీపంలోని ధకడ్‌ఖేడీ గ్రామంలో బుధవారం రాత్రి జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 32 ఏళ్ల వివాహిత రింకీ, కోటకు చెందిన 19 ఏళ్ల యువకుడు గౌరవ్ పదునైన ఆయుధంతో హత్య చేయబడ్డారు. అది కూడా నూతన సంవత్సరం అర్థరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసారు. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. వివాహిత భర్త పరారవడంతో అతడిని గాలించి చివరికి శుక్రవారం నాడు అరెస్ట్ చేసారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి.
 
ఈ జంట హత్యల కేసులో పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, చనిపోయిన యువకుడికి, వివాహితకు కోటలోనే పరిచయం ఏర్పడింది. మృతుడి సోదరి కోటాలో నివసిస్తోంది. ఈ క్రమంలో అతడికి పొరుగునే వుండే రింకూతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త మరింత సన్నిహితమై వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన సోదరిని చూసే వంకతో తరచూ ఆమె ఇంటికి వస్తూ రింకూ భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెతో శృంగారంలో మునిగితేలిపోయేవాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రింకూ భర్త గణేష్ యువకుడిని పరోక్షంగా హెచ్చరించాడు.
 
ఐతే గౌరవ్ ఈ మాటలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. తనకు అడ్డు వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటావని రింకూ భర్తకే హెచ్చరికలు చేసాడు. ఈ క్రమంలో నూతన సంవత్సరం 2025 సందర్భంగా గౌరవ్ నేరుగా రింకూ వద్దకు వచ్చి కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఇక ఆరోజు రాత్రి ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు. అదను కోసం చూస్తున్న గణేష్ పదునైన ఆయుధంతో అర్థరాత్రి ఇంట్లోకి వచ్చాడు. అతడిని చూసి ఇద్దరూ భీతావహులయ్యారు.
 
ఒక్క ఉదుటున గౌరవ్ పైన మారణాయుధంతో మెరుపు దాడి చేసాడు గణేష్. దాంతో అతడు నేలకొరిగాడు. అతడిని హత్య చేయడాన్ని అడ్డుకునేందుకు భార్య రింకూ ముందుకు వచ్చింది. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న గణేష్.. ఆమెను కూడా పాశవికంగా నరికేశాడు. తెల్లారేసరికి ఇంట్లో ఇద్దరూ రక్తపుమడుగులో కొనఊపిరితో వుండటాన్ని ఇరుగుపొరుగువారు గమనించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఐతే ఇద్దరూ మార్గమధ్యంలోనే మృతి చెందారు. 
 
 మృతుడు గౌరవ్ హడా సోదరుడు ప్రియాంషు హడా తరపున పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు