శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (17:01 IST)

విశాల్ కు మరోసారి తప్పిన ప్రమాదం

vishal-truck accident
vishal-truck accident
హీరో  విశాల్ కు మరోసారి  ప్రమాదం తప్పింది.  తన సినిమాల కోసం డూప్ లేకుండా యాక్షన్ విన్యాసాలు చేయడానికి ఇష్టపడతాడు. గతంలో మూడు సార్లు యాక్షన్  సీన్స్ తనే చేస్తుండగా ప్రమాదం జరిగింది. తాగాజా మార్క్ ఆంథోనీ దర్శకత్వం వహిస్తున్న తన రాబోయే సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు యాక్షన్ సన్నివేశం కోసం ఉపయోగించే ఒక ట్రక్ అదుపు తప్పి విశాల్‌ను ఢీకొట్టింది. అయితే  కొద్దిలో తప్పించుకున్నాడు. 
 
విశాల్ ఈ సంఘటన ఫుటేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.  దాన్ని బట్టిచూస్తే ట్రక్ బ్రేక్  కంట్రోల్ లేదని తెలుస్తోంది. ఇది  సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని సిబ్బంది పేర్కొన్నారు. అలాగే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించారు.
 
ఈ సంఘటన యొక్క వీడియోను పంచుకుంటూ, విశాల్ ఇలా వ్రాశాడు, “కొన్ని సెకన్లు, కొన్ని అంగుళాల వ్యవధిలో నా జీవితాన్ని కోల్పోయాను అనిపించింది, సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు అంటూ తెలిపారు.