ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (17:41 IST)

అజయ్ కతుర్వార్ అజయ్ గాడు నుండి ర్యాప్ సాంగ్ విడుదలైంది

Ajay Gadu song
Ajay Gadu song
విశ్వక్‌ సినిమా తర్వాత, అజయ్ కతుర్వార్ తన రాబోయే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల  "అజయ్ గాడు" టీజర్‌ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. దీనికి అందరి నుంచి విశేష స్పందన లభించింది. ఈరోజు మేకర్స్ ఈ చిత్రంలోని మొదటి సింగిల్‌తో అందరినీ ఆనందపరిచారు. "కైకు మామా" అనే ర్యాప్ సాంగ్ ను విడుదల చేసారు చిత్రబృందం.ఈ పాట వెనుక ఉన్న కాన్సెప్ట్ అద్భుతం. శ్రీకాంత్, అజయ్, ఇన్సాన్ రాసిన ఇంపాక్ట్‌ఫుల్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. DOP అజయ్ నాగ్ విజువల్స్ మరియు విశాల్ యొక్క స్టైలిష్ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది.
 
సుమంత్ బట్టు సంగీతం సమకూర్చారు. ఈ పాటను రాపర్ ఇన్సాన్ పాడారు. ఇది ఒక చార్ట్‌బస్టర్ అయ్యేలా ఉంది.అద్భుతమైన టీజర్ మరియు ఇప్పుడు మెస్మరైజింగ్ ఫస్ట్ సింగిల్, అజయ్ కతుర్వార్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు అజయ్ కతుర్వార్ దర్శకత్వం వహించారు.  చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందాల భామలు భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు.
 
అజయ్ నాగ్ మరియు హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని సమకూర్చారు.