శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:24 IST)

శింబుకు రవితేజ సపోర్ట్... ఎలాగంటే?

తమిళ స్టార్ హీరో శింబు మరోసారి తన స్టార్ డమ్ చూపించేందుకు భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి తెలుగు మాస్ స్టార్ రవితేజ సహకారం అందించడం ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వీహౌస్ ప్రొడక్షన్ పతాకంపై సురేష్ కామాచి నిర్మిస్తున్న సినిమా 'మానాడు'. 
 
ఈ సినిమాను దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అంతేకాకుండా ఈ సినిమాను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఇందులో శింబు సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ రోజు మధ్యాహ్నం 2గంటల 34 నిమిషాలకు తెలుగు మాస్ మహరాజ రవితేజ రిలీజ్ చేయనున్నారు. 
 
ఈ సినిమాలో దక్షణాదిలోని ప్రముఖ దర్శకులు ఎస్ ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, భారతీ రాజా, కరుణాకరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తుండడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా క్రేజ్ వస్తుంది.