ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (14:21 IST)

నిశ్శబ్ధం విడుదల వాయిదా.. అనుష్క కెరీర్ సంగతేంటి?

నిశ్శబ్ధం సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేస్తున్నట్లు సినీ యూనిట్ వర్గాల సమాచారం. దీంతో నిశ్శబ్ధం ఫిబ్రవరిలో విడుదల చేస్తారని టాక్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం నిశ్శబ్దం ఫిబ్రవరిలో కాదు ఏప్రిల్ 2న విడుదల కానుందని తెలుస్తుంది.  
 
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్‌గా నటించింది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సుబ్బరాజు, అంజలి, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేతో హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 
 
కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.  నిశ్శబ్దం తెలుగు తోపాటు  తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో అనుష్క కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. భాగమతి తర్వాత అనుష్క సినిమాల్లో కనిపించకపోవడం గమనార్హం.