శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 3 డిశెంబరు 2019 (20:53 IST)

అనుష్క `నిశ్శ‌బ్దం` విడుద‌ల తేదీ ఖ‌రారు

అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31, 2020లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. 2017లో ఈ క‌థ హేమంత్ మ‌ధుక‌ర్ రూపంలో న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చింది. నిన్నుకోరి సినిమా విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. 
 
క‌థ మ‌నల్ని క‌దిలిస్తే .. అది సినిమా అవుతుందని ర‌చ‌యిత కోన చెప్పారు. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నే ఫీలింగ్ క‌లిగింది. ఇద్ద‌రం రెండేళ్లు ట్రావెల్ అయ్యాం. ఈ ప్ర‌యాణంలో అనుకోని మంచి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. మేం న‌మ్మిన ఈ క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు విశ్వ‌ప్ర‌సాద్‌గారు దొరికారు.

మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించిన తొలి తెలుగు సినిమా ఇదేన‌ని అనుకుంటున్నాను. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. అలాంటి నిర్మాత దొర‌క‌డం వ‌ల్ల‌నే అది సాధ్య‌మైంద‌ని భావిస్తున్నాను అని కోన వెంక‌ట్ అన్నారు.