బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (14:47 IST)

నా నోటి వెంట బూతు డైలాగులా? నో... నెవర్ అంటున్న జేజమ్మ

అలనాటి సినీ నటి, తమిళ హీరో భార్య జ్యోతిక రీఎంట్రీ ఇస్తూ నటించిన తాజా చిత్రం "నాచ్చియార్". ఈ తమిళ చిత్రం విడుదల కాకముందే వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా, ఈ చిత్రంలోని డైలాగులు పెను వివాదాన్నే సృష్టించాయ

అలనాటి సినీ నటి, తమిళ హీరో భార్య జ్యోతిక రీఎంట్రీ ఇస్తూ నటించిన తాజా చిత్రం "నాచ్చియార్". ఈ తమిళ చిత్రం విడుదల కాకముందే వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా, ఈ చిత్రంలోని డైలాగులు పెను వివాదాన్నే సృష్టించాయి. అయినప్పటికీ.. చిత్ర యూనిట్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తమిళంలో జ్యోతి పోషించిన టైటిల్‌ రోల్‌ను తెలుగులో అనుష్క చేస్తే బాగుంటుందని భావించి, ఆమెను సంప్రదించారట. అయితే 'నాచ్చియార్'’గా నటించేందుకు అనుష్క విముఖత చూపినట్టు తెలుస్తోంది. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జ్యోతిక పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రలో నటించింది. ఒక సన్నివేశంలో ఆమె పోలీసు డ్రెస్‌లోనే బూతు డైలాగు చెప్పి.. పెను వివాదంలో చిక్కుకుంది. 
 
ఈ కారణంగానే 'నాచ్చియార్'లో నటించడానికి అనుష్క వెనకడుగు వేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నిజానికి గత కొన్నేళ్లుగా అనుష్క హీరోయిన్‌ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతోంది. ఇటీవల 'భాగమతి'గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై, ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను ఆశ్చర్యకితుల్ని చేసింది. అందుకే 'నాచ్చియార్' తెలుగు వెర్షన్‌‌లో అనుష్కతో నటించింపజేయాలని భావించారు. కానీ, జేజమ్మ నో చెప్పడంతో వారు నిరాశ చెందారట.