ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (13:48 IST)

షమీ నన్ను చంపి అక్కడ పాతేయమన్నాడు.. కోహ్లీలా పెళ్లిచేసుకోవాలనుకున్నాడు..

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను చంపి అడవిలో పాతిపెట్టమని షమీ సోదరుడికి చెప్పినట్లు హసీన్ ఆరోపించింది. తొలుత తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాల

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను చంపి అడవిలో పాతిపెట్టమని షమీ సోదరుడికి చెప్పినట్లు హసీన్ ఆరోపించింది. తొలుత తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు ఆరోపించిన హసీన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
 
తనను హత్యమార్చాలని కూడా షమీ ప్లాన్ వేశాడని.. ఇందులో తన సోదరుడి సాయం తీసుకున్నాడని హసీన్ చెప్పుకొచ్చింది. తనను చంపి అడవిలో పాతిపెట్టాల్సిందిగా షమీ తన సోదరుడికి పురమాయించాడని చెప్పింది. ఇప్పటికే హసీనా వ్యాఖ్యలతో షమీ ఉద్యోగం ఊడింది. ఈ నేపథ్యంలో హసీనా రోజుకో ఆరోపణతో షాకిస్తోంది. 
 
గత రెండేళ్ల పాటు వేధిస్తున్న షమీ.. విడాకులివ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని హసీన్ తెలిపింది. తనను వదిలించుకుని విరాట్ కోహ్లీలా బాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్ళాడాలనుకున్నాడని హసీన్ వెల్లడించింది.