గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (20:00 IST)

ఆ రోజు రెండో భార్య శవాన్ని భుజంపై మోశాడు... ఇప్పుడు మూడో భార్యతో...

గత ఏడాది ఆగస్టు నెలలో టీబీతో చనిపోయిన తన భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేక భుజంపై మోసుకుని వెళ్లిన ఓ వ్యక్తి అందరికీ గుర్తుండే వుంటాడు. ఆరోజు తన భార్య శవాన్ని అతడు 10 కిలోమీటర్ల మేర భుజంపై

గత ఏడాది ఆగస్టు నెలలో టీబీతో చనిపోయిన తన భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేక భుజంపై మోసుకుని వెళ్లిన ఓ వ్యక్తి అందరికీ గుర్తుండే వుంటాడు. ఆరోజు తన భార్య శవాన్ని అతడు 10 కిలోమీటర్ల మేర భుజంపై వేసుకుని వెళ్లాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యాయి.
 
ఐతే ఇప్పుడతడి జీవితం పూర్తిగా మారిపోయింది. అతడి బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ. 36 లక్షలు వున్నాయి. ఒడిషా ప్రభుత్వం అతడి కుమార్తె చదువు బాధ్యతను తీసుకుంది. మరో విషయం ఏమిటంటే... అతడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అతడికిది మూడోపెళ్లి. ఇందిరా ఆవాస యోజన క్రింది ఒడిషా ప్రభుత్వం అతడికి పక్కా ఇల్లు కూడా కట్టించింది. మంగళవారం నాడు అతడు మార్కెట్లోకి వచ్చిన కొత్త బైకు కొనుక్కుని దానిపై కూర్చుని ఓ స్టిల్ పోస్ట్ చేశాడు. ఇప్పుడా ఫోటో వైరల్ అవుతోంది.