శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (14:58 IST)

మహిళలు పురుషులతో సమానం కాదు.. అంతకంటే ఎక్కువే: కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే.. ఒకరితో ఒకరికి పోలిక వుండకూడదన్నాడు. స్త్రీ పురుషులు సమానంగా వుంటేనే బాగు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే.. ఒకరితో ఒకరికి పోలిక వుండకూడదన్నాడు. స్త్రీ పురుషులు సమానంగా వుంటేనే బాగుంటుందని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్త్రీలు సమానత్వం కంటే ఎక్కువేనని కోహ్లీ అన్నాడు.
 
ఇంకా ''మీ జీవితంలో విలువైన మహిళలను ట్యాగ్ చేయాలని'' అభిమానులను కోరాడు. తన భార్య అనుష్క శర్మను కోహ్లీ ట్యాగ్ చేశాడు. మహిళలు వివక్ష, లైంగిక వేధింపులు, గృహహింస వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎదుగుతున్నారని కోహ్లీ తెలిపాడు. సమానత్వం కంటే మహిళలు ఎక్కువైనప్పటికీ.. వారు పురుషులతో సమానం అయినప్పటికీ, పురుషులతో మహిళలకు సమానత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.