బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 మార్చి 2018 (21:17 IST)

యువతి ముందు ప్యాంటు విప్పి ఆ పని చేసిన కామాంధుడు...

బెంగళూరులో ఓ కామాంధుడు చేసిన చేష్టలకు ఓ యువతి భీతిల్లిపోయింది. ఆమె బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఓ కామాంధుడు ఆమె ఎదుట ప్యాంటు విప్పి ఆమెను చూస్తూ హస్త ప్రయోగం చేశాడు. వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని వసంతనగర మౌంట్‌ కార్మెల్‌ కాలేజీ బస్టాండ్‌లో ఓ

బెంగళూరులో ఓ కామాంధుడు చేసిన చేష్టలకు ఓ యువతి భీతిల్లిపోయింది. ఆమె బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఓ కామాంధుడు ఆమె ఎదుట ప్యాంటు విప్పి ఆమెను చూస్తూ హస్త ప్రయోగం చేశాడు. వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని వసంతనగర మౌంట్‌ కార్మెల్‌ కాలేజీ బస్టాండ్‌లో ఓ యువతి బస్సు కోసం వేచి చూస్తోంది. 
 
ఆ సమయంలో కేఏ-53సీ 1877 నెంబర్‌ కారును డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన ఓ కారు డ్రైవరు ఆమె వద్ద కారు ఆపి ప్యాంటు విప్పి ఆమె వైపు చూస్తూ హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన యువతి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లిపోయింది. ఐనా వదలని సదరు కారు డ్రైవరు మళ్లీ ఆమె నిలబడిన ప్రాంతానికి వచ్చి మళ్లీ అదే పని చేశాడు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి, తనను మానసిక వేదనకు గురి చేశాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.