బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (18:41 IST)

రంజాన్ మాసం.. షార్ట్స్ వేసుకుందని చెంపపై లాగి కొట్టాడు.. వీడియో చూడండి

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో గీతా ఫొగట్‌గా నటించిన ఫాతిమా సనా షేక్‌పై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ఫాతిమా బికినీలో కనిపించింది. రంజాన్ మాసంలో ఇలాంటి అసభ్యకరమైన ఫో

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో గీతా ఫొగట్‌గా నటించిన ఫాతిమా సనా షేక్‌పై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ఫాతిమా బికినీలో కనిపించింది. రంజాన్ మాసంలో ఇలాంటి అసభ్యకరమైన ఫోటోలను నెట్లో పోస్ట్ చేసి అమ్మడు వివాదం కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకున్న పాపానికి ఓ యువతిపై కదులుతున్న బస్సులోనే ఓ యువకుడు దాడి చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పవిత్ర రంజాన్ మాసంలో యువతి పొట్టి దుస్తులతో బస్సు ఎక్కిందని.. ఓ యువకుడు బస్సు నుంచి దిగుతూ దిగుతూ చెంపపై కొట్టాడు. ఆమె తిరిగి కొట్టడంతో ఆమెపై దాడి చేశాడు. తర్వాత ఆమెను నెట్టేసి బస్సు నుంచి దిగి పారిపోయాడు. ఈ ఘటన టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో చోటుచేసుకుంది. 
 
బుధవారం నాడు అసీనా మెలిసా సగ్లామ్ (21) అనే యువతి బస్సులో షార్ట్ ధరించి ఓ సీటులో కూర్చుని ఉంది. ఆమె వెనకే సైలెంట్‌గా కూర్చున్న ఓ యువకుడు.. బస్సు దిగి వెళ్తూ చెంపపై లాగి కొట్టాడు. అతను బస్సు దిగేలోపే అతనిని ఆ యువతి నిలదీసింది. దాంతో ఆ యువకుడు పొట్టి దుస్తులు ఎందుకు వేసుకున్నావ్ అంటూ ప్రశ్నించాడు. అలా అంటూనే ఆమెపై దాడి చేసి వెనక్కి నెట్టేసి ఆ యువకుడు బస్సు నుంచి దిగి పారిపోయాడు. 
 
దీంతో సదరు యువతి ఏడుస్తూ కూలబడిపోగా, సాటి ప్రయాణికులు ఓదార్చారు. ఈ ఘటనంతా బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. ఈ వీడియో మీరూ చూడండి.