'అర్జున్ రెడ్డి' రామకృష్ణకు పెళ్లి ఫిక్స్.. 'ఎవరికీ చెప్పకండి' అంటూ ట్వీట్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సెన్సేషనల్ చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రంలో హాస్యనటుడిగా రామకృష్ణ నటించాడు. ఈ చిత్రంలో ఈయన పండించిన హాస్యానికి ప్రేక్షకులు కడుపుబ్బనవ్వారు. దీంతో రామకృష్ణకు మంచి పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ ఇపుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
"జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరికీ చెప్పకండి" అంటూ ట్వీట్ చేశాడు. తనకు కాబోయే భార్యతో సముద్రపు ఒడ్డున దిగిన ఫొటోను జత చేశాడు. అయితే వారి మొహాలు కనిపించకుండా ఫొటో ఉండటంతో… పెళ్లికూతురు ఎవరు? ఎలా ఉంటుంది? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరోవైపు పెళ్లి వార్తను వెల్లడించిన రామకృష్ణకు హీరోలు నిఖిల్, సుశాంత్, సిద్ధార్థ్ కమెడియన్ వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ రామన్‌లతో పాటు పలువురు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.