శ్రీరాముడే చంపుతుంటే ఇక ఎవరికి మొరపెట్టుకునేది రామా...
దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికి సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధన
దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికి సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధనుస్సును తీసి చూసేసరికి దాని కొన రక్తసిక్తమై ఉండటం గమనించాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో తమ్ముడూ... చూడు, చూడు ఏదో ప్రాణి హింసకు గురి అయినట్లుంది అన్నాడు.
లక్ష్మణుడు మట్టి తవ్వి చూసేసరికి పెద్ద కప్ప ఒకటి కనిపించింది. అది మరణించే స్థితిలో ఉంది. రాముడు కరుణ పూరిత స్వరంతో నువ్వెందుకు అరవలేదు. మేము నిన్ను కాపాడటానికి ప్రయత్నించి ఉండేవాళ్లం కదా... పాము వాతన పడినప్పుడు నువ్వు బెకబెక మంటావు కదా.. అన్నాడు. అందుకు ఆ కప్ప ఇలా అంది....
ఓ రామా..... పాము పట్టుకున్నప్పుడు ఓ రామా... రక్షించు, ఓ రామ రక్షించు... అని కేకలు పెడతాను. అయితే ఇప్పుడు చూడబోతే రాముడే నన్ను చంపుతున్నాడు. అందుకే నేను మౌనం వహించాను అని అంది.
- శ్రీరామకృష్ణ పరమహంస