ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (13:24 IST)

విడుదలకు ముందే భారత్‌లో బీభత్సం సృష్టిస్తున్న "అవతార్-2"

Avatar: The Way Of Wate
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అవతార్-2". ఈ నెల 16వ తేదీన భారతదేశ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, రికార్డు స్థాయిలో బుక్కింగ్స్ అవుతున్నాయి. తొలిరోజు ప్రదర్శనను తిలకించేందుకు 2 లక్షల టిక్కెట్లు అమ్ముడు పోగా, వీకెండ్‌ రోజుల్లో ప్రదర్శనలకు 4.10 లక్షల టిక్కెట్లు విక్రయమయ్యాయి. 
 
అడ్వాన్స్ బుక్కింగ్స్‌లోనే ఆలిండియా వైడ్ రూ.7 కోట్ల గ్రాస్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. 'కేజీఎఫ్-2', 'బాహుబలి-2' చిత్రాలు ఈస్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇపుడు 'అవతార్-2' ఇదే స్థాయిలో రాబట్టి వాటి సరసన చేరింది. శని, ఆదివారాల్లో ఈ సినిమా ప్రదర్శనలకు 4.10 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీని ప్రకారంగా రూ.16 కోట్ల గ్రాస్ వసూలైనట్టు అంచనా. కేవలం అడ్వాన్స్ బుక్కింగ్స్‌ల రూపంలోనే అవతార్ రూ.80 కోట్ల మేరకు వసూలు చేసే అవకాశం ఉంది.
 
కాగా, హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన 'అవతార్' ప్రపంచ వ్యాప్తంగా రూ.28 వేల కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఇపుడు దానికి సీక్వెల్‌గా 'అవతార్-2 : ద వే ఆఫ్ వాటర్' పేరుతో వస్తుంది. ఇందులో శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీనర్, కేట్ విన్ స్లెట్, స్టీఫెన్ లాంగ్‌ తదితరులు నటించారు.