శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (22:24 IST)

'అవతార్' సీక్వెల్ ట్రైలర్ జల ప్రపంచాన్ని ఆవిష్కరించింది..

avatar-2 trailer
ఎంతోకాలంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న అవతార్ సీక్వెల్ సినిమా డిసెంబరు నెలలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ జలప్రపంచాన్ని ఆవిష్కరించింది. 
 
దశాబ్దకాలం క్రితం వచ్చిన అవతార్ ప్రపంచ వెండితెరపై చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. అనేక భాషల్లోకి అనువాదం చేసిన నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. ఇపుడు ఈ చిత్రం సీక్వెల్ రానుంది. డిసెంబరు 16వ తేదీన విడుదల కానుంది. 
 
"అవతార్: ది వే ఆఫ్ వాటర్" పేరుతో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఏప్రిల్ 27న, లాస్ వెగాస్‌లోని సినిమాకాన్ ఎక్స్‌పోజిషన్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీక్వెల్ నుండి మొదటి ఫుటేజ్ ప్రదర్శించబడింది. ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది.
 
సిగోర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్, మిచెల్ యోహ్, ఈడీ ఫాల్కో, స్టీఫెన్ లాంగ్, గియోవన్నీ రిబిసి, ఊనా చాప్లిన్, జెర్మైన్ క్లెమెంట్ మరియు ఇతరులు కూడా సీక్వెల్‌లో కనిపిస్తారు. ఈ ట్రైలర్‌లోని సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టుగా తెలుస్తుంది. అద్ఫుతమై గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తుంది.